Friday, December 4, 2009

యువత

వేగం మాకు వేదం
ఎదురేదంది పాదం
ఏదైనా వెళ్ళే పథం

సహనం మేము వీడం
వెనకే మేము చూడం
విశ్వాసమే ఆయుధం

కెరటాలే ఆదర్శం...పడుతున్నా లేచొస్తాం...తీరాన్నే దాటేస్తాం...
అలుపెరుగని పోరాటం...అనుక్షణము చేసేస్తాం...విధి రాతని మారుస్తాం...

పోరాటమే మా ఇంధనం
ప్రోత్సాహమే మా ఔషధం
ప్రయత్నమే గాండీవం

ఆ గగనమే మా లక్ష్యం
అడ్డంకులే సోపానం
విజయమే మా గమ్యం

గతమంతా ఖతమంటాం...ఈ క్షణమే బతికేస్తాం...భవితంతా మాదేనంటాం...